News March 26, 2025

డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి పనిచేస్తున్నాం: కలెక్టర్

image

పార్వతీపురం మ‌న్యం జిల్లాను డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి ప్రణాళికాబ‌ద్దంగా ప‌నిచేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.శ్యామ్ ప్ర‌సాద్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. 2వ రోజు జరిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో బుధవారం ఆయ‌న జిల్లా ప్ర‌గ‌తిపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. జిల్లాలో గిరిజ‌నలు ఎక్కువ‌గా ఉన్నార‌ని,కొండ ప్రాంతాల్లో ర‌హ‌దారి స‌దుపాయం లేక డోలీలు ఉప‌యోగిస్తున్నార‌ని అన్నారు.

Similar News

News December 13, 2025

తిరుపతి: కొత్తగా 1,251 ఉద్యోగాలు.!

image

నాయుడుపేటలోని MP SEZలో PCB తయారీ యూనిట్ ఏర్పాటుకు CIPSA TEC India Pvt Ltdకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం 20 ఎకరాల భూమిని 75% రాయితీతో ఆ సంస్థకు కేటాయించింది. రూ.1,140 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టుతో ద్వారా 1,251 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 కింద తొలి 10 ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచి ప్రోత్సాహకాలను అందుకోనుంది.

News December 13, 2025

జుట్టుకు బలాన్నిచ్చే విటమిన్లివే..!

image

ప్రస్తుతకాలంలో కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చాలామంది హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఈ విటమిన్లుండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. విటమిన్ బి7, విటమిన్ డి, ఐరన్, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, తగినంత నీరు తాగడం వంటివి చేస్తే పట్టులాంటి జుట్టు సొంతమవుతుందంటున్నారు.

News December 13, 2025

పాలమూరు: పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది..!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రిజర్వేషన్ల కారణంగా అధిక శాతం మహిళలే గెలుపొందారు. ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అనుభవం లేని మహిళలు.. నిరక్షరాస్యులైన కొత్త వాళ్లు వార్డు సభ్యులు, సర్పంచ్‌గా గెలుపొందారు. వీరి పదవి అలంకారప్రాయమైన.. పెత్తనం మాత్రం భర్త, కుమారులది కొనసాగనుంది.