News March 27, 2025

డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి పనిచేస్తున్నాం: కలెక్టర్

image

పార్వతీపురం మ‌న్యం జిల్లాను డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి ప్రణాళికాబ‌ద్దంగా ప‌నిచేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.శ్యామ్ ప్ర‌సాద్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. 2వ రోజు జరిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో బుధవారం ఆయ‌న జిల్లా ప్ర‌గ‌తిపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. జిల్లాలో గిరిజ‌నలు ఎక్కువ‌గా ఉన్నార‌ని,కొండ ప్రాంతాల్లో ర‌హ‌దారి స‌దుపాయం లేక డోలీలు ఉప‌యోగిస్తున్నార‌ని అన్నారు.

Similar News

News November 21, 2025

గుంటూరులోని ఈ బాలుడు మీకు తెలుసా?

image

గుంటూరు రైల్వేస్టేషన్ తూర్పు గేటు పార్కింగ్ వద్ద నవంబర్ 18న ఉదయం 8 గంటలకు మూడేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా దొరికాడు. తల్లిదండ్రుల ఆచూకీ లభించకపోవడంతో ఆర్‌పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలుడిని కొత్తపేట పోలీసుల ద్వారా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలుడు తన వివరాలు చెప్పలేకపోతున్నాడు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు తనను 8688831320 నంబర్‌లో సంప్రదించాలని కొత్తపేట సీఐ కోరారు.

News November 21, 2025

రాజమౌళి క్షమాపణ చెప్పడం మంచిది: విష్ణువర్ధన్ రెడ్డి

image

దేవుడిని నమ్మనంటూ దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదం కొనసాగుతోంది. తాజాగా దీనిపై బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ‘దేవుడిపై చేసిన వ్యాఖ్యలకు సినీ దర్శకుడు రాజమౌళి క్షమాపణ చెప్పి వివాదానికి ముగింపు పలకడం మంచిది’ అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు క్షమాపణలు చెప్పకపోతే.. కచ్చితంగా ఆయన సినిమాలు ఆపేస్తామంటూ విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది.

News November 21, 2025

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి కొడాలి, వల్లభనేని

image

ఉమ్మడి కృష్ణా జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా గుర్తింపున్న నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీరు కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో పాలిటిక్స్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు. తాజాగా వీరిద్దరూ జగన్‌తో భేటీ కావడంపై వార్తల్లో నిలిచారు. కొడాలి, వంశీ తిరిగి యాక్టివ్ అవ్వాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ మళ్లీ ప్రజలతో మమేకమవుతూ, పలు రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.