News March 5, 2025
డ్యూ బాల్ ప్రధాన కార్యదర్శిగా నల్లమల క్రీడాకారుడు

రాష్ట్ర డ్యూ బాల్ ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేట మండలం దేవులపాడుకు చెందిన సభవత్ బాబు నాయక్‌ను నియమించినట్లు డ్యూ బాల్ ఇండియా అధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో డ్యూ బాల్ క్రీడను విస్తరించి, క్రీడాకారులు రాణించేలా కృషి చేస్తానన్నారు. జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానని చెప్పారు.
Similar News
News October 23, 2025
సిర్సనగండ్లలో అత్యధిక వర్షపాతం నమోదు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా వంగూరు మండలం సిర్సనగండ్లలో 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్ 7.3, పెద్ద పెద్దపల్లి 6.8, కల్వకుర్తి 4.5, యెంగంపల్లి, బోలంపల్లి 3.5, ఊర్కొండ 2.5, జటప్రోలు 1.0, తోటపల్లి, తెలకపల్లి 0.8, అత్యల్పంగా నాగర్‌కర్నూల్, ఐనోల్లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
News October 23, 2025
మెదక్: మంత్రి వివేక్ Vs హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్లో బుధవారం చెక్కుల పంపిణీలో మంత్రి వివేక్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య మాటల యుద్దం జరిగింది. కళ్యాణ లక్ష్మితోపాటు తులం బంగారం, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు, సిద్దిపేటలో ఆగిపోయిన అభివృద్ధి పనులపై హరీశ్ ప్రశ్నించగా, BRS చేసిన అప్పులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం అందజేతపై మంత్రి మాట్లాడారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సమాధానాలతో ఇరువురి ప్రసంగాలు సాగాయి.
News October 23, 2025
చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. యాలాల వాసులు మృతి

చేవెళ్ల మండలంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మల్కాపూర్ ప్రధాన రహదారి మీద గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యాలాల మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. స్కూటీని ఢీ కొట్టి వెళ్లిన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.