News March 5, 2025
డ్యూ బాల్ ప్రధాన కార్యదర్శిగా నల్లమల క్రీడాకారుడు

రాష్ట్ర డ్యూ బాల్ ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేట మండలం దేవులపాడుకు చెందిన సభవత్ బాబు నాయక్‌ను నియమించినట్లు డ్యూ బాల్ ఇండియా అధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో డ్యూ బాల్ క్రీడను విస్తరించి, క్రీడాకారులు రాణించేలా కృషి చేస్తానన్నారు. జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానని చెప్పారు.
Similar News
News March 27, 2025
డైలీ ట్రాన్జాక్షన్లకు UPI, భారీ ఖర్చులకు క్రెడిట్‌కార్డు

డైలీ ట్రాన్జాక్షన్ల కోసం UPIను అత్యధికంగా వినియోగిస్తున్న యువత భారీ కొనుగోళ్లకు మాత్రం క్రెడిట్ కార్డును వాడేందుకే ఇష్టపడుతోందని కివీ, అనోమర్ సర్వే తెలిపింది. నెల రోజులు వడ్డీలేని సులభ రుణం దొరకడం, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బులు అలాగే ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. ఈజీ యాక్సెస్, భారీ రీచ్ వల్ల 70% యువ కస్టమర్లు రోజువారీ ఖర్చులకు, 81% మంది వ్యక్తిగత లావాదేవీలకు UPIని వాడుతున్నారని పేర్కొంది.
News March 27, 2025
పుతిన్‌కి టైమ్ దగ్గర పడింది: జెలెన్‌స్కీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి టైమ్ దగ్గరపడిందని, త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చస్తేనే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిజమని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇరుదేశాల మధ్య సయోధ్య కుదర్చాలని జెలెన్‌స్కీ USను కోరుతున్నారు.
News March 27, 2025
ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్లకు రూ.లక్ష రుణం: కలెక్టర్

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముందు డబ్బులు పెట్టుకోలేని నిరుపేదలకు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వివిధ మండలాల్లోని పైలట్ గ్రామాల్లో మంజూరు చేసిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. పైలట్ గ్రామాల్లో ఎంపిక చేసిన 850 లబ్ధిదారుల్లో ఇంటి నిర్మాణానికి ముందు రుణాలను ఇవ్వాలని అన్నారు.