News March 22, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ.1.20 లక్షల ఫైన్

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట సీఐ YRK శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. శుక్రవారం జగ్గంపేట ఎస్సై రఘునాథరావు, గండేపల్లి ఎస్సై శివ నాగబాబు చేపట్టిన ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 17 మంది పట్టుపడ్డారు. వీరిని కోర్టులో హాజరు పరచగా 12 మందికి రూ.10 వేల చొప్పున ఫైన్ విధించినట్లు సీఐ తెలిపారు.
Similar News
News March 23, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>అల్లూరి: లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు>అల్లూరి జిల్లాలో ఈ నెల 26వరకూ తేలికపాటి వర్షాలు>రాజవొమ్మంగిలో వర్షం..చల్లబడ్డ వాతావరణం>దేవీపట్నం: ముసురిమిల్లి కాలువతో చెరువులకు నీటి సరఫరా>మూగజీవాల మృత్యుఘోష అధికారులకు పట్టదా>రంపచోడవరం: 4,400 మందికి ఉల్లాస్ పరీక్ష>పాడేరు: జాతీయోద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి>అనంతగిరి మండలానికి పదోన్నతిపై ఏడుగురి కార్యదర్శులు.
News March 23, 2025
రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా?

ప్రస్తుత బిజీ జీవితంలో నిద్రాసమయం కుంచించుకుపోతోంది. ఎప్పుడు పడితే అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కానీ రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం శరీరానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే నిద్ర నాణ్యత కోల్పోవడమే కాకుండా జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. అలాగే నిద్రలేచిన వెంటనే అలసట, నీరసంగా ఉండి ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. రోగనిరోధకశక్తి బలహీనపడి అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు.
News March 23, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.