News April 12, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన కాజీపేట పోలీసులు

రోడ్డు ప్రమాదాల నివారణతో నేరస్థులను గుర్తించడంలో భాగంగా కాజీపేట్ ఎస్ఐ లవణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బంధం చెరువు ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులపై కేసు నమోదు చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని ఎస్‌ఐ వాహనదారులను హెచ్చరించారు.
Similar News
News December 9, 2025
ఆర్థిక సమస్యలను తొలగించే ‘ద్వార లక్ష్మీ పూజ’

ఇంటి గడపను లక్ష్మీ ద్వారంగా భావించి, దేవతలను ఆహ్వానించడానికి పసుపు, కుంకుమలతో అలంకరిస్తాం. అయితే 16 రోజులు ‘ద్వార లక్ష్మీ పూజ’ ఆచరిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు, జాతక దోషంతో బాధపడుతున్నవారు ఈ పూజ చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మీ ద్వార పూజ ఎప్పుడు, ఎలా చేయాలి? పూజా ఫలితాలు తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News December 9, 2025
గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత(2/2)

ప్రతీ రెండు నుంచి మూడేళ్లకు ఒకసారి విత్తన పొట్టేలును మార్చాలి. ఎంపిక చేసుకునే పొట్టేలు దృఢంగా, ఎత్తుగా, చురుకుగా, ఎక్కువ బరువు, అధిక లైంగికాసక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా కవల పిల్లలను కనే సంతతి నుంచి వచ్చిన పొట్టేలును ఎంచుకోవడం చాలా మంచిదని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్లకు పైన వయసున్న పొట్టేలును మాత్రమే ఎంచుకోవాలి. మరింత సమాచారం కోసం వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవాలి.
News December 9, 2025
నేటి నుంచి లారీల బంద్

AP: టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్‌తో ఇవాళ అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేస్తున్నట్లు లారీ ఓనర్ల సంఘం ప్రకటించింది. దాదాపు 10వేల లారీలు నిలిచిపోనుండటంతో కూరగాయలు, నిత్యావసరాలు, ధాన్యం, రేషన్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. 13 ఏళ్ల వాహనాల ఫిట్‌నెస్ ఫీజు గతంలో రూ.1,400 ఉండగా కొత్త నిబంధనల ప్రకారం రూ.33వేలు చెల్లించాల్సి వస్తోందని లారీల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


