News April 1, 2025

డ్రంక్ అండ్ డ్రై తనిఖీలతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యం: వరంగల్ సీపీ

image

డ్రంక్ అండ్ డ్రై తనిఖీల ద్వారా రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ట్రాఫిక్ అధికారులకు సూచించారు. మంగళవారం హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ నియంత్రణతో పాటు.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ సీతా రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 16, 2025

MNCL: రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలి: కలెక్టర్

image

మంచిర్యాల జిల్లాలోని రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో యాసంగి సీజన్ పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే యాసంగి కాలంలో లబ్ధి పొందే విధంగా రైతులు పంట సాగు చేయాలని, ఆ దిశగా అధికారులు రైతులకు అవసరమైన మెలకువలు, సలహాలు అందించాలని సూచించారు.

News November 16, 2025

జాతీయవాదం వల్లే యుద్ధాలు: మోహన్ భాగవత్

image

ప్రపంచ సమస్యలకు సమాధానాలు అందించే తెలివి, ఆలోచన ఇండియాకు ఉన్నాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ‘జాతీయవాదం కారణంగానే యుద్ధాలు జరుగుతాయి. అందుకే ప్రపంచ నేతలు అంతర్జాతీయవాదం గురించి మాట్లాడటం ప్రారంభించారు. కానీ తమ దేశ ప్రయోజనాలనే ప్రధానంగా చూసుకుంటారు’ అని చెప్పారు. జైపూర్‌లో నిర్వహించిన దీన్ దయాళ్ స్మృతి ఉపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

News November 16, 2025

19న పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 9:50కి విమానాశ్రయం చేరుకుని, 10 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకుంటారు. 10:20కి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే సత్యసాయి జయంతోత్సవాలలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30కి కోయంబత్తూర్‌కు బయలుదేరనున్నట్లు పీఎంవో తెలిపింది.