News February 7, 2025
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత: తిరుపతి SP

సమాజంలో డ్రగ్ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉందని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కరకంబాడి రోడ్ ఫ్యాబ్ బిల్డింగ్‌లో మెడికల్ షాప్ యజమానులు, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ హరిప్రసాద్‌తో కలిసి ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ని నిర్మూలించే బాధ్యత అందరిదని గుర్తు చేశారు. భావి తరాలు చెడిపోకుండా అందరూ సహకరించాలని కోరారు.
Similar News
News March 25, 2025
BNR: నిర్వాసితులకు అన్ని రకాల మౌలిక వసతులు: R&R కమిషనర్

ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు కేటాయించిన అర్&అర్ కాలనీలలోఅన్ని రకాల మౌలిక సౌకర్యాలు వేగవంతం చేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో అర్&అర్ పనులను సమీక్షించారు.
News March 25, 2025
డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మృతి

తమిళ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా(48) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన తాజ్‌మహల్, అల్లీ అర్జున, అన్నక్కోడి, పల్లవన్, తదితర తమిళ చిత్రాల్లో నటించారు.
News March 25, 2025
అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా JSW స్టీల్ రికార్డ్

ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా JSW స్టీల్ రికార్డు సృష్టించింది. $30.31B మార్కెట్ విలువను సాధించింది. $90Mతో ఆర్సెలార్ మిత్తల్, $3Bతో న్యూకోర్ కార్ప్‌ను వెనక్కి నెట్టేసింది. ఈ భారతీయ కంపెనీ విజయనగర, డోల్వి, సేలమ్‌లో ప్లాంట్లు, అమెరికా, ఇటలీలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత 35.7MT ఉత్పత్తి సామర్థ్యాన్ని FY28లో 43.5 MT, FY31లో 51.5 MTకి పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.