News December 2, 2024
డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన కొరియోగ్రాఫర్

TG: కొరియోగ్రాఫర్ కన్హా మహంతి(కన్నా) డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డారు. ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి మాదాపూర్ ఓయోలో ఇచ్చిన పార్టీలో ఇతను పాల్గొన్నారు. ఓ ప్రముఖ టీవీ షోలో కన్నా కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ, గంజాయి, ఇతర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరితో పాటు మొత్తం నలుగురిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News November 21, 2025
24 నుంచి కొత్త కార్యక్రమం

AP: సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వారంపాటు జరిగే ఈ ప్రోగ్రామ్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై అవగాహన కల్పిస్తారు. అలాగే DEC 3న RSKల పరిధిలో వర్క్షాపులు నిర్వహిస్తారు.
News November 21, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News November 21, 2025
రంగేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

గతంలో తెల్ల జుట్టు వస్తేనే రంగేసుకొనేవారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్, ట్రెండ్ అంటూ రకరకాల రంగులతో జుట్టు స్వరూపాన్ని మార్చేస్తున్నారు. దీనికి ముందు కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. చర్మ రంగుని బట్టి జుట్టు రంగును ఎంచుకోవాలి. రంగు మాత్రమె కాదు షేడ్ కూడా చూసుకోవాలి. లేదంటే జుట్టు, మీ అందం చెడిపోతాయి. మొదటిసారి రంగేస్తున్నట్లయితే వీలైనంత వరకు నిపుణులను సంప్రదించడం మంచిది.


