News February 18, 2025
డ్రైనేజీ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలి: కమిషనర్

డ్రైనేజీ నిర్మాణానికి ప్రజల సహకరించాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. 42వ డివిజన్లోని తెలంగాణ కాలనీలో డ్రైన్ ఏర్పాటుకు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలు నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. స్థానికుల సౌకర్యార్థం డ్రైన్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్థానికులతో పాటు సదరు యజమాన్యం సహకరించాలని, వారికి న్యాయం చేస్తామని కమిషనర్ తెలిపారు.
Similar News
News November 18, 2025
ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.

కర్నూలు: 595 మందికి షోకాజ్ నోటీసులు

‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్’ల పంపిణీకి సంబంధించి విద్యార్థుల నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ చర్యలు తీసుకున్నారు. 26 మంది మండల విద్యాశాఖ అధికారులు, 569 మంది ప్రధానోపాధ్యాయులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో సరైన వివరణ ఇవ్వకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.