News February 18, 2025

డ్రైనేజీ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలి: కమిషనర్ 

image

డ్రైనేజీ నిర్మాణానికి ప్రజల సహకరించాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. 42వ డివిజన్లోని తెలంగాణ కాలనీలో డ్రైన్ ఏర్పాటుకు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలు నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. స్థానికుల సౌకర్యార్థం డ్రైన్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్థానికులతో పాటు సదరు యజమాన్యం సహకరించాలని, వారికి న్యాయం చేస్తామని కమిషనర్ తెలిపారు.

Similar News

News March 19, 2025

జనగామ: ఇంటి వద్దకే భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణ తలంబ్రాలు

image

జనగామ ఆర్టీసీ బస్సు డిపో కార్గో ద్వారా భక్తుల ఇంటివద్దకే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలియజేశారు. తలంబ్రాల బుకింగ్ కొరకు కార్గో లాజిస్టిక్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్,  కార్గో ఏజెంట్ రూ.151 చెల్లించి రశీదు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇంటి వద్దకు కార్గో ఏజెంట్ ద్వారా తలంబ్రాలు పంపిణీ చేస్తారని తెలిపారు.

News March 19, 2025

భూపాలపల్లి: కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: వైద్యాధికారి 

image

కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్ పిలుపునిచ్చారు. మంగళవారం తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో కుష్టి వ్యాధిపై పలు సూచనలు చేశారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సర్వేకు సహకరించాలని కోరారు. వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం రూ.12 వేల చొప్పున అందిస్తుందన్నారు.

News March 19, 2025

వ్యోమగాముల తిరుగు ప్రయాణం స్ఫూర్తిదాయకం: CBN

image

వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ సురక్షితంగా భూమిపైకి రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వారి తిరుగు ప్రయాణం, టీమ్ వర్క్ ఆదర్శప్రాయమైన మానవ సంకల్పాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. దీనిని సుసాధ్యం చేసినందుకు ప్రతి ఒక్కరినీ అభినందించారు. వ్యోమగాముల శక్తి సామర్థ్యాలకు సెల్యూట్ చేశారు.

error: Content is protected !!