News January 31, 2025
డ్రైవర్లు దేవుళ్లతో సమానం: ఎస్పీ శరత్ చంద్ర

దేశంలోని ఆర్టీసీలలో అతి తక్కువ శాతం ప్రమాదాలు తెలంగాణ ఆర్టీసీలో మాత్రమే ఉన్నాయని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నల్గొండ డిపో గ్యారేజ్‌లో ఉమ్మడి నల్లగొండ ఆర్ఎం కె. జానిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ భద్రత మాసోత్సవాలలో పాల్గొని మాట్లాడారు. ఏ సీజన్‌లోనైనా కష్టపడి డ్రైవర్లు బస్సులు ఆపరేట్ చేస్తున్నారని, డ్రైవర్లు దేవుళ్లతో సమానమని అన్నారు. డ్రైవర్లు స్పీడ్ కంట్రోల్ చేసుకొని నడపాలన్నారు.
Similar News
News February 19, 2025
NLG: ఇందిరమ్మ ఇండ్లు సరే.. ఇసుకెట్ల..!?

రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే లబ్థిదారుల ఎంపిక కూడా పూర్తయింది. సొంత స్థలం ఉన్నవారి ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే.. జిల్లాలో సాగుతున్న ఇసుక దోపిడీతో ఇళ్ల నిర్మాణానికి కూడా దొరికే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 19, 2025
శివాజీ జయంతి: హోరెత్తనున్న నల్గొండ

హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 398వ జయంతి ఉత్సవాలకు నల్గొండ ముస్తాబైంది. పల్లెపల్లెనా, మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ర్యాలీలు తీసేందుకు ఇప్పటికే ఏర్పాట్లుచేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో శివాజీ మహారాజ్ శోభాయాత్ర ఉంటుందని హిందూవాహినీ సభ్యులు తెలిపారు. రామగిరి రామాలయం నుంచి సాయంత్రం 4 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
News February 19, 2025
శ్రీలత రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే!

BJP జిల్లా పార్టీ పగ్గాలు తొలిసారి మహిళ చేతిలోకి వెళ్లాయి. జిల్లా అధ్యక్షురాలిగా నేరేడుచెర్లకు చెందిన శ్రీలతరెడ్డిని అధిష్ఠానం నియమించింది. 2019లో BRSతో రాజకీయప్రస్థానం మొదలుపెట్టిన ఈమె నేరేడుచెర్ల మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2023లో MP ఈటల సమక్షంలో BJPలో చేరి HNR నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్ BJPలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.