News January 21, 2025
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే నార్నూర్ రోడ్డు ప్రమాదం: ASP

నార్నూర్ మండలంలో ఐచర్ బోల్తా ఘటన ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవర్ కనక శ్రీరామ్ ఐచర్ వాహనం నడిపినట్లు పేర్కొన్నారు. డ్రైవర్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 2 మృతి చెందగా.. 35 మందికి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News October 15, 2025
సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి: ADB కలెక్టర్

రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 25 వరకు జరిగే విజన్-2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని సూచించారు. ఈ సర్వే లింక్‌ను, QR కోడ్‌ను తమ కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
News October 14, 2025
ADB: అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి

అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు అండగా నిలవాలని, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న
దౌర్జన్యాల పట్ల తక్షణమే స్పందించి వారికి న్యాయం చేకూర్చాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి సభ్యుల అభిప్రాయాలు స్వీకరించారు.
News October 14, 2025
ఆదిలాబాద్‌లో బంగారం రికార్డు ధర.!

బంగారం పేదవాడికి అందని ద్రాక్షగా మారనుందా.? అంటే వాటి గణాంకాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా పసిడి రేటు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఈరోజు మంగళవారం బంగారం ధర మార్కెట్లో తులానికి రూ.1,31,500 పలికి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. పసిడి రేటును చూసి సాధారణ ప్రజలు బెంబలెత్తిపోతున్నారు.