News January 16, 2025
డ్రోన్ ఎగిరిందనే నెపంతో దాడి: కాటసాని
YCP నేత మహమ్మద్ ఫైజ్ కుమారుడి వివాహ వేడుకలను చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై ఎగిరిందనే కారణంతో బుధవారం రాత్రి బీసీ అనుచరులు ఫైజ్ కుటుంబం, డ్రోన్ ఆపరేటర్లపై దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎస్ఐ దుగ్గిరెడ్డికి ఫిర్యాదు చేశారు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన ఇంట భయభ్రాంతులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News January 16, 2025
నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టండి: మంత్రి టీజీ భరత్
రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టండి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా, ఎస్పీతో కలిసి ఆయా శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు.
News January 16, 2025
బేతంచర్లలో పేడ రంగు తాగి మహిళ ఆత్మహత్య
ఇంటి ముందు కల్లాపు చల్లుకునే పేడ రంగు తాగి మహిళ మృతి చెందిన ఘటన బేతంచెర్ల మండలం పెండేకల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొట్టాల మహేశ్వరి(22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగును నీటిలో కలుపుకొని తాగింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న మహేశ్వరిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు బంధువులు వాపోయారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లెకు తరలించి కేసు నమోదు చేశారు.
News January 16, 2025
ఉపాధి వేతన దారులకు పనులు కల్పించండి: కలెక్టర్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామపంచాయతీలో ప్రతిరోజు వంద మంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించి నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబిలైజేషన్ లక్ష్యాన్ని సాధించాలని అధికారులను కలెక్టర్ జీ.రాజకుమారి ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్, హౌసింగ్ మ్యాండేస్, సచివాలయ సర్వీసులపై సమీక్షించారు.