News January 16, 2025
డ్రోన్ ఎగిరిందనే నెపంతో దాడి: కాటసాని

YCP నేత మహమ్మద్ ఫైజ్ కుమారుడి వివాహ వేడుకలను చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై ఎగిరిందనే కారణంతో బుధవారం రాత్రి బీసీ అనుచరులు ఫైజ్ కుటుంబం, డ్రోన్ ఆపరేటర్లపై దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎస్ఐ దుగ్గిరెడ్డికి ఫిర్యాదు చేశారు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన ఇంట భయభ్రాంతులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 16, 2025
తుగ్గలి: ఒకటే చెట్టు.. రెండు విభిన్నతలు

తుగ్గలి మండలం రాతన ఆశ్రమ పాఠశాల సమీపంలోని ఓ చింత చెట్టు చూపరులను ఆకర్షిస్తోంది. చెట్టు ఓ వైపు ఆకులు ఎండిపోయి కనిపిస్తుంటే, మరో వైపు పచ్చని ఆకులతో కళకళలాడుతోంది. రెండు వర్ణాలతో దర్శనమిస్తున్న చెట్టు ఆ మార్గం గుండా వెళ్లే చూపరులను, వాహనదారులను, రైతులను ఆకట్టుకుంటోంది.
News February 16, 2025
నంద్యాల జిల్లాలో నవజాత శిశువు లభ్యం

సిరివెళ్ల మండలం జునెపల్లె ఎస్సీ కాలనీలో నవజాత శిశువు లభ్యం అయ్యింది. ఆదివారం తెల్లవారుజామున గ్రామంలోని ఓ వ్యక్తి కూలీలను పనికి పిలుస్తుండగా ఖాళీ స్థలం నుంచి శిశువు ఏడుపును గమనించాడు. అక్కడికి వెళ్లి చూడగా ఆడ శిశువుగా గుర్తించాడు. 108 వాహనానికి ఫోన్ చేయగా వారు వైద్యం నిమిత్తం శిశువును తీసుకెళ్లారు. అధికారులు విచారణ చేపట్టారు.
News February 16, 2025
కర్నూలు, ఆదోనిలో ఎండు మిర్చి ధరల వివరాలు

కర్నూలు, ఆదోని వ్యవసాయ మార్కెట్లలో శనివారం ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,236 పలకగా.. కనిష్ఠ ధర రూ.2,200 పలికింది. కర్నూల్లో కనిష్ఠంగా రూ.3,500 పలకగా.. గరిష్టంగా రూ.12,813 పలికినట్లు ఆయా మార్కెట్ల ఎంపిక శ్రేణి అధికారులు తెలిపారు.