News February 23, 2025
ఢిల్లీని మించిన HYD.. జనాభాలో తగ్గేదేలే!

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 312 కాగా, హైదరాబాద్ జిల్లాలో ఇది 18,161కు చేరింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ (11,313) కంటే ఎక్కువ. హైదరాబాద్ జిల్లా జనాభా సుమారు 39.43 లక్షలు. నగరంలో గ్రామీణ ప్రాంతాలు లేకపోవడంతో ఇది పూర్తిగా శహరీకృతమైంది. జనాభా పెరుగుదలతో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.
Similar News
News October 23, 2025
విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద బస్సు, లారీ ఢీ

విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం నుంచి విశాఖపట్నం వస్తున్న బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు.
News October 23, 2025
అందరికీ ఆదర్శం ఈ కిసాన్ చాచీ

బిహార్లోని ముజఫర్పుర్ జిల్లా సరేయాకు చెందిన 73 ఏళ్ల రాజకుమారి దేవి ఉత్సాహంగా సైకిల్పై ప్రయాణిస్తూ కనిపిస్తారు. గత 20ఏళ్లుగా సైకిల్పై వెళ్లి సమీపగ్రామాల్లోని మహిళలకు ఆధునిక వ్యవసాయం, ఊరగాయలు పెట్టడం నేర్పిస్తున్నారామె. ఆమె సేవలకుగానూ 2007లో కిసాన్ శ్రీ, 2019లో పద్మశ్రీ అవార్డులు వరించాయి. తాము ఆర్థికంగా బలపడేందుకు సాయం చేస్తున్న రాజకుమారిని అక్కడివారు ముద్దుగా కిసాన్ చాచీ అని పిలుచుకుంటారు.
News October 23, 2025
సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 21 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు. బుధవారం 73,853 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 22,551 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.47 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.