News February 24, 2025
ఢిల్లీని మించిన HYD.. జనాభాలో తగ్గేదేలే!

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 312 కాగా, హైదరాబాద్ జిల్లాలో ఇది 18,161కు చేరింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ (11,313) కంటే ఎక్కువ. హైదరాబాద్ జిల్లా జనాభా సుమారు 39.43 లక్షలు. నగరంలో గ్రామీణ ప్రాంతాలు లేకపోవడంతో ఇది పూర్తిగా శహరీకృతమైంది. జనాభా పెరుగుదలతో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.
Similar News
News December 4, 2025
రబీ(యాసంగి) వరి – విత్తన శుద్ధి ఎలా చేయాలి?

పంటలో తెగుళ్ల ఉద్ధృతి తగ్గాలంటే విత్తన శుద్ధి చేయడం కీలకం. వరిలో కేజీ పొడి విత్తనానికి కార్బండజిమ్ 3గ్రాములను కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. తడి విత్తనానికి లీటరు నీటిలో కార్బండజిమ్ 1గ్రామును కలిపి ఆ ద్రావణంలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి మండి కట్టి మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో లేదా దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తనాన్ని పలుచని పొర నీటిలో చల్లుకోవాలి. తర్వాత నీటిని పూర్తిగా తీసివేయాలి.
News December 4, 2025
జగిత్యాల: మొదటి విడతలో నలుగురు సర్పంచులు ఏకగ్రీవం

జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను నిర్వహిస్తున్నారు. 7మండలాల్లో మొత్తం 122 పంచాయతీలు ఉండగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 4గ్రామాల సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన వాటిలో ఇబ్రహీంపట్నం మండలంలో మూలరాంపూర్, యామాపూర్, మెట్ పల్లి మండలంలో చింతల్ పేట, కథలాపూర్ మండలంలో రాజారాంతండా ఉన్నాయి.
News December 4, 2025
మోదీ ఒత్తిడికి లొంగే వ్యక్తి కాదు: పుతిన్

PM మోదీ ఒత్తిడికి లొంగే వ్యక్తి కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. భారత్పై సుంకాలతో US ఒత్తిడి తెస్తోందా అన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. ‘భారత్ దృఢమైన వైఖరిని ప్రపంచం చూసింది. తమ నాయకత్వం పట్ల దేశం గర్వపడాలి’ అని India Today ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా-ఇండియా ద్వైపాక్షిక లావాదేవీల్లో 90% పైగా విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. తన ఫ్రెండ్ మోదీని కలుస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.


