News March 8, 2025
ఢిల్లీలో ప.గో జిల్లా సర్పంచ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి రావాలని ఉండి మండలం మహాదేవపట్నం సర్పంచ్ వెంకట సుబ్బలక్ష్మికి ఆహ్వానం రావడంతో ఢిల్లీ వెళ్లారు. తమ గ్రామంలో చేసిన అభివృద్ధి, చేయబోయే కార్యక్రమాల గురించి వర్క్ షాప్‌లో వివరించారు. ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి ప.గో జిల్లా మహిళకు అవకాశం రావడంపై అందరూ అభినందిస్తున్నారు.
#HappyWomensDay
Similar News
News March 27, 2025
మొగల్తూరుపై పవన్ ఫోకస్.. కారణం ఇదే!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి స్వగ్రామం మొగల్తూరు. తండ్రిది పెనుగొండ. దీంతో ఈ రెండు గ్రామాలపై డిప్యూటీ సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రెండు చోట్ల సమస్యలు తెలుసుకోవడానికి శుక్రవారం ప్రత్యేక మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఏకంగా పవన్ పేషీకి సంబంధించిన అధికారులు ఈ రెండు గ్రామాలకు వస్తారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి పవన్‌కు వివరించనున్నారు. ఆ తర్వాత అభివృద్ధి పనులు చేపడతారు.
News March 27, 2025
ప.గో జిల్లాలో టెన్షన్.. టెన్షన్

పశ్చిమగోదావరి జిల్లాలో మరికాసేపట్లో ఎంపీపీ, ఉపసర్పంచ్ పదవులకు ఉప ఎన్నిక జరగనుంది. అత్తిలి, యలమంచిలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. ఓ ఐదారు మంది వైసీపీకి హ్యాండ్ ఇస్తే ఆ ఎంపీపీ పదవులు కూటమి ఖాతాలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆ దిశగా కూటమి నాయకులు ప్లాన్ చేశారని సమాచారం. వైసీపీకి షాక్ ఇస్తారా? లేదా ఆ స్థానాలను వైసీపీనే నిలబెట్టుకుంటుందా? చూడాలి. మరోవైపు పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
News March 27, 2025
భీమవరంలో ప్రేమ పేరుతో మోసం

ప్రేమంటూ మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం పట్టణానికి చెందిన ఓ యువతిని గుడిసె ఉదయ్ ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఈక్రమంలో 2023 మేలో ఆమెను లోబర్చుకున్నాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని చెబుతూ వచ్చాడు. ఇటీవల యువతి గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పాడు. ఈనెల 22న యువతి ఫిర్యాదు చేయగా.. ఉదయ్‌ను అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం తణుకు జైలుకు తరలించారు.