News July 4, 2024
ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన కలిశెట్టి

ఢిల్లీ పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబుకు ఎంపీ కలిశెట్టి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు.
Similar News
News February 24, 2026
అదుపులో డయేరియా: శ్రీకాకుళం కలెక్టర్

శ్రీకాకుళం పట్టణ కేంద్రంలోని దమ్మలవీధి, గుడివీధి, మంగువారితోట, కాకివీధి ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫిబ్రవరి 23న కేసులు వెలుగుచూసిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, రెవెన్యూ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
News February 24, 2026
శ్రీకాకుళం: డయేరియా మృతుని కుటుంబానికి రూ.10 లక్షలు

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో డయేరియాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు. మృతుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మెరుగైన వైద్యం, వైద్యుల నిరంతర పర్యవేక్షణ ఉండేవిధంగా ఆదేశాలిచ్చామన్నారు.
News February 24, 2026
సారవకోట: జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా 70 ఉద్యోగాలు

జిల్లా గ్రంథాలయ సంస్థలో 70 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాల్సి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకరరావు తెలిపారు. సారవకోట మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు జిల్లా పట్టణ, గ్రామీణ పంచాయతీల నుంచి రావలసిన 8% గ్రంథాలయ సెస్సులను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.


