News February 8, 2025
ఢిల్లీ ఫలితాలపై ప.గో. జిల్లాలో టెన్షన్

ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ రేగుతోంది. అయితే ఢిల్లీ ఎన్నికల సెగ జిల్లాను సైతం సాగుతోంది. ఢిల్లీలో నేడు వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా పందేలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, ఆప్ మధ్య పోరు జరుగుతుండగా ఇక్కడి పందెం రాయుళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తుది ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యేసరికి పెద్ద ఎత్తున నగదు చేతులు మారనుంది.
Similar News
News October 15, 2025
పాలకొల్లు: లారీ, బైక్ ఢీ.. పురోహితుడు మృతి

పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెయిన్ రోడ్డుపై బుధవారం బైక్, లారీ ఢీ కొన్న ఘటనలో పురుహితుడు శివకోటి అప్పారావు (60) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు.. జిన్నూరు గ్రామానికి చెందిన అప్పారావు ఎక్సెల్ మోటార్ సైకిల్ వాహనంపై ప్రయాణిస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
News October 15, 2025
భీమవరం: జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం బీచ్ రిసార్ట్స్కు మౌలిక వసతులు కల్పించే అంశంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పర్యాటకం విస్తృతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. దీనిలో భాగంగా, సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్న రిసార్ట్స్కు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని అవసరం ఉందన్నారు.
News October 15, 2025
కర్నూలు జీఎస్టీ విజయోత్సవ సభకు జిల్లా నుంచి 400 మంది

కర్నూలులో ఈనెల 16న నిర్వహించనున్న ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ విజయోత్సవ సభకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 400 మంది ట్రేడర్లు, పన్ను చెల్లింపుదారులు (టాక్స్ పేయర్స్) హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న ఈ సభకు ట్రేడర్స్ను తరలించడానికి భీమవరం నుండి రెండు బస్సులు, పాలకొల్లు, తాడేపల్లిగూడెంల నుంచి ఒక్కో బస్సును ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు.