News August 15, 2024

ఢిల్లీ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రకాశం జిల్లా ఉపాధ్యాయిని

image

బల్లికురవ మండలం మల్లాయపాలెం అంగన్వాడీ కార్యకర్త జి నాగమణికి అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వేడుకలలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్త నాగమణికి అవార్డును అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అవార్డు అందుకున్న నాగమణిని పలువురు అభినందించారు.

Similar News

News November 25, 2025

ప్రకాశం SP మీకోసంకు 63 ఫిర్యాదులు.!

image

ఒంగోలు SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన SP మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వర ఆదేశాలతో మహిళా పోలీస్ స్టేషన్ DSP రమణకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను పోలీసు అధికారులు తెలుసుకున్నారు.

News November 24, 2025

ప్రకాశం: పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

image

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలన్నారు.