News February 8, 2025

ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.

Similar News

News February 15, 2026

ప్రపంచంలోనే తొలి ఇంజినీరింగ్ కాలేజీ.. ఎక్కడో తెలుసా?

image

ఇంజినీరింగ్ విద్యకు ఎంతో క్రేజ్ ఉంది. దానికి తగ్గట్లే ఎన్నో వర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా వెలిశాయి. ఈ విద్యకు 300 ఏళ్ల కిందటే నాంది పడింది. JAN 18, 1707న చెక్ రిపబ్లిక్ రాజధాని అయిన ప్రేగ్‌లో చెక్ టెక్నికల్ వర్సిటీని రోమన్ చక్రవర్తి జోసెఫ్-1 స్థాపించారు. ఇదే వరల్డ్స్ ఫస్ట్ ఇంజినీరింగ్ వర్సిటీ. సైనిక కోటలు, మౌలిక సదుపాయాల నిర్మాణాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు. క్రమంగా దీన్ని విస్తరించారు.

News February 15, 2026

ఆత్మకూరు (ఎం): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

image

మండలంలోని రాయిపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మోత్కూరు నుంచి భువనగిరి వైపు బైక్‌పై వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తిరుమలగిరి తొండ గ్రామానికి చెందిన వెంకట్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News February 15, 2026

బోథ్: బంతి కోసం వెళ్లి బాలుడి మృతి

image

బోథ్ మండలంలో విషాదం నెలకొంది. కరత్వాడ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్(12) ఆదివారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న క్రమంలో బంతి పక్కన గల కాలువలో పడింది. బంతి కోసం వెళ్లిన షేక్ ఇమ్రాన్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు.