News February 8, 2025
ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.
Similar News
News April 11, 2026
దేవరకొండ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగి ఘరానా మోసం

దేవరకొండ డిండి రోడ్డులోని బ్యాంకులో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించాడు. విదేశాల్లో ఉంటున్న, సుదీర్ఘకాలంగా లావాదేవీలు జరపని వారి అకౌంట్లను లక్ష్యంగా చేసుకుని అధికారుల కళ్లుగప్పి పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసి వాటితో పరారయ్యాడు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి అధికారులు రహస్యంగా దర్యాప్తు చేపట్టి, నష్టపోయిన సొమ్ముపై లెక్కలు తీస్తున్నారు.
News April 11, 2026
ప.గో: పెళ్లింట తీవ్ర విషాదం

పెదవేగిలోని వలసపల్లి సమీపంలో <<19612501>>గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలపూడి(M)ముక్కంపాడుకు<<>> చెందిన సచివాలయ ఉద్యోగి సుధీర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇతని భార్య గర్భిణీ. అంతేకాకుండా మరోవైపు మృతుని సోదరునికి ఈ నెల 25న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోవడంతో పెళ్లింట శోక సంద్రంలో మునిగిపోయారు.
News April 11, 2026
ఎల్లారెడ్డిపేట: సెక్యూరిటీ లేకే.. ఏటీఎం ఎత్తుకెళ్లారు!

ఎల్లారెడ్డిపేటలో ఎస్బీఐ ఏటీఎం మిషన్ చోరీకి భద్రతా లోపమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మండలంలోని ఐదు ఏటీఎంలలో కేవలం ఒక సిరిసిల్ల బ్యాంకుకు మాత్రమే సెక్యూరిటీ గార్డు ఉండటం గమనార్హం. జిల్లాలోనే ఇది మొట్టమొదటి వింత చోరీ కావడంతో ఎస్పీ తీవ్రంగా పరిగణించి, నిందితుల వేట కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భద్రతా నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


