News February 8, 2025
ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.
Similar News
News November 17, 2025
నస్రుల్లాబాద్: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

నస్రుల్లాబాద్ మండలం దుర్కి చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు బాన్సువాడ ఏఎస్ఐ సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో డీసీఎంలో తరలిస్తున్న దాదాపు 12 టన్నుల బియ్యను పట్టుకుట్లు పోలీసులు చెప్పారు. ఈ బియ్యం హైదరాబాద్ నుంచి గాంధారి మీదుగా కోటగిరిలోని ఓ రైస్ మిల్కు తరలిస్తున్నట్లు సమాచారం. డీసీఎంను నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
News November 17, 2025
సిద్దిపేట: వ్యర్థాలతో కలుషితమవుతున్న చెరువులు

మాంస, వైద్య వ్యర్థాలను చెరువుల్లో ఇష్టానుసారంగా పారవేయడం వలన జలాలు కలుషితమై దుర్వాసన వెదజల్లుతున్న సంఘటనలు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల నెలకొంటున్నాయి. చెరువులు చెత్తా చెదారాలతో కలుషితమై దుర్వాసనలు వెదజల్లుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులపై అధికారులకు పట్టింపు లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
News November 17, 2025
NEEPCLలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


