News February 8, 2025
ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.
Similar News
News February 11, 2026
హుస్నాబాద్: 84.21 శాతం పోలింగ్

హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డులలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని 20 వార్డులలో మొత్తం 19,277 మంది ఓట్లకు గాను 16,192 (84.21%) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు (7916), మహిళలు (8272), ఇతరులు (4) ఓటు వేశారు. పోలీసులు ఉదయం నుంచి పటిష్ట బందోబస్తు నిర్వహించగా, పోలింగ్ సమయం ముగియడంతో అధికారులు గేట్లు బంద్ చేశారు.
News February 11, 2026
గద్వాల: మున్సిపాలిటీల వారిగా పోలింగ్ ఇలా..!

గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 78.22% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో అయిజ మున్సిపాలిటీ అత్యధిక పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలవగా, గద్వాల మున్సిపాలిటీలో పోలింగ్ కాస్త తక్కువగా నమోదైంది.
అయిజ 84.69% (అత్యధికం)
అలంపూర్ 81.18%
గద్వాల 74.57%
వడ్డేపల్లి 84.26%*
News February 11, 2026
NRPT: మద్దూరులో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు

నారాయణపేట జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల పరిధిలో పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 72.87 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపాల్టీల వారిగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
నారాయణపేటలో 74.18 శాతం, కోస్గి 74.83%, మక్తల్ 65.83%, మద్దూరు 79.0 శాతం పోలింగ్ నమోదైంది. మద్దూరు మున్సిపాల్టీ పరిధిలో అత్యధికంగా 79.0 శాతం పోలింగ్ నమోదైంది.


