News January 31, 2025
తంగళ్లపల్లి: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మధ్యాహ్న భోజనాలు సిద్ధం చేసే గది, వండే విధానాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం ఈ రోజు ఏ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారో ఆరా తీశారు.
Similar News
News November 17, 2025
డిసెంబర్లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

న్యాయ చట్టాలపై అవగాహన కల్పించాలి: నాగరాణి

న్యాయపరమైన చట్టాలపై రిటైర్డ్ ఉద్యోగులు ఇతరులకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నాగరాణి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో పాటు, తెలిసినవారికి న్యాయ చట్టాల గురించి తెలియజేయాలని సూచించారు.