News January 31, 2025
తంగళ్లపల్లి: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మధ్యాహ్న భోజనాలు సిద్ధం చేసే గది, వండే విధానాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం ఈ రోజు ఏ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారో ఆరా తీశారు.
Similar News
News February 20, 2025
BREAKING: జగన్‌పై కేసు నమోదు

AP: మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డు కార్యక్రమం నిర్వహించినందుకు నల్లపాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా 8 మందిపై కేసు పెట్టారు.
News February 20, 2025
మెదక్: బీఆర్ఎస్ సమావేశానికి మాజీ జడ్పీ ఛైర్ పర్సన్

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. మెదక్ జడ్పీ ఛైర్ పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ ఛైర్ పర్సన్ రోజా శర్మ, వంటేరు ప్రతాపరెడ్డి, చింత ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.
News February 20, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS

@గంజాయి అమ్ముతున్న 5గురిని పట్టుకున్న పోలీసులు… వివరాలు వెల్లడించిన డిఎస్పీ@మెట్పల్లిలో యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్య@మెట్పల్లిలో అంతర్ జిల్లా దొంగల అరెస్ట్.. 11 లక్షల సొత్తు స్వాధీనం @చిట్టాపూర్‌లో మెకానిక్ షాప్‌కి నిప్పుపెట్టిన దుండగులు @పెగడపల్లిలో భార్య, పిల్లల చావులకు కారణమైన వ్యక్తి రిమాండ్ @మేడిపల్లిలో చికిత్స పొందుతూ మత్స్యకారుడు మృతి @కొడిమ్యాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన