News March 16, 2025

తంగళ్ళపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముందస్తు అరెస్ట్

image

కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీని సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాట్ల మధు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్న విషయం తెలిసిందే. సవాల్ కోసం సిరిసిల్లకు చేరుకున్న టోనీని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతి భద్రతల దృష్ట్యా తంగళ్లపల్లిలో మధును, సిరిసిల్లలో టోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Similar News

News October 29, 2025

పార్వతీపురం జిల్లాలో 118.70హెక్టార్లలో వరి పంటకు నష్టం

image

పార్వతీపురం మన్యం జిల్లాలో మొంథా తుఫాన్ వల్ల సగటు వర్షపాతం 42.90mm నమోదయ్యిందని కలెక్టరేట్ నుంచి బుధవారం నివేదిక వెళ్లడయ్యింది. 118.70 హెక్టార్లలో వరిపంట వర్షానకి నష్టం వాటిల్లిందని, ఐదు ఇల్లు పాక్షికంగా, ఒకటి పూర్తిగా ధ్వంశమయ్యావన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు 9 పునరావరాస సహాయ కేంద్రాలు ఏర్పరిచినట్లు ప్రకటించారు. అధికారులు నష్టాలను అంచనాలు వేయాలనికలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించరు.

News October 29, 2025

వనపర్తి: భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

image

‘మొంథా’ తుఫాను ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు విద్యుత్ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

News October 29, 2025

NGKL: భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులపై భారీ వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే ‘డైల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు.