News April 7, 2025
తంగళ్ళపల్లి: బీఆర్ఎస్ యువ నాయకుడి మృతి

తంగళ్ళపల్లి మండలం కస్బేకట్కూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు జూపల్లి సందీప్ రావు హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. సందీప్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పార్టీ నాయకులు పేర్కొన్నారు. మృతి చెందిన సందీప్ రావుకు అఖిలపక్ష నాయకులు తమ సంతాపాన్ని తెలిపారు.
Similar News
News November 22, 2025
తీవ్ర పోటీ: రంగారెడ్డి DCC పెండింగ్!

AICC కొత్తగా DCC ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. RCపురానికి చెందిన దేప భాస్కర్ రెడ్డి, బడంగ్పేట మాజీ మేయర్ చిగురింత నర్సింహా రెడ్డి, చేవెళ్ల నుంచి భీంభరత్, ఎల్బీనగర్ నేత రాంమోహన్ గౌడ్, షాద్నగర్ నుంచి మాజీ MLA ప్రతాప్ రెడ్డి DCC ఆశించినట్లు తెలిసింది. పెండింగ్లో ఉంచడానికి తీవ్ర పోటీ ప్రధాన కారణమని సమాచారం.

నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా వెడ్మ బొజ్జు

నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి నియోజకవర్గంలో పార్టీని గెలిపించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగానూ గుర్తింపు పొందడంతో ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.