News April 7, 2025
తంగళ్ళపల్లి: బీఆర్ఎస్ యువ నాయకుడి మృతి

తంగళ్ళపల్లి మండలం కస్బేకట్కూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు జూపల్లి సందీప్ రావు హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. సందీప్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పార్టీ నాయకులు పేర్కొన్నారు. మృతి చెందిన సందీప్ రావుకు అఖిలపక్ష నాయకులు తమ సంతాపాన్ని తెలిపారు.
Similar News
News April 19, 2025
నైతికంగా వారు ఓడిపోయారు: కన్నబాబు

విశాఖ నగర మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి నాయకులు అడ్డదారిలో గెలిచినా నైతికంగా మాత్రం ఓడిపోయినట్లు మాజీ మంత్రి ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. శనివారం విశాఖలో పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ..పార్టీ విప్ ఉల్లంఘించిన 27 మందిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా పార్టీకి అండగా నిలిచిన 32 మంది కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
News April 19, 2025
ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. అధికారులు 8 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అనంతరం వాంగ్మూలంపై ఎంపీ సంతకం తీసుకున్నారు. మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని అధికారులు విచారించారు.
News April 19, 2025
ఖమ్మంలో 10 ఆసుపత్రులు సీజ్ : DMHO

CMRF బిల్లుల జారీలో అవకతవకలకు పాల్పడిన ఖమ్మంలోని 10 ఆసుపత్రులను మూసివేసినట్లు DMHO డా.కళావతి బాయి తెలిపారు. శ్రీ వినాయక, శ్రీకర మల్టీ స్పెషాలిటీ, సాయిమల్టీ స్పెషాలిటీ, వైష్ణవి, సుజాత, ఆరెంజ్, న్యూ అమృత, మేఘ, JR ప్రసాద్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దుచేసి మూసివేసినట్లు చెప్పారు. చికిత్సలు చేయకుండానే నకిలీ బిల్లును సృష్టించి CMRF నిధులను కాజేశారని పేర్కొన్నారు.