News April 20, 2025
తంగళ్ళపల్లి: వలకు చిక్కిన భారీ చేప

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన జాలరు గోలాడ నరేశ్‌కు వలలో 32.5 కిలోల భారీ బొచ్చ చేప చిక్కింది. రోజు లాగానే సిరిసిల్లలోని మిడ్ మానేరులో చేపలు పట్టడానికి వెళ్లగా వలలో భారీ చేప చిక్కిందని నరేశ్ తెలిపాడు. ఇంతవరకు ఎప్పుడూ ఇంత పెద్ద చేప ఎప్పుడు చిక్కలేదని, మొదటిసారిగా ఇంత పెద్ద చేపను పట్టుకున్నామని నరేశ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ భారీ చేపను చూడడానికి స్థానికులు ఆసక్తి చూపారు.
Similar News
News April 20, 2025
సఖినేటిపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం రోడ్డులో రాంబాగ్ దాటిన తరువాత IPC చర్చి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న నిమ్మకాయల వ్యాపారి బొనం బాపిరాజు (35) కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
జేఈఈలో 299వ ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్‌కు చెందిన అచ్చిన రాకేశ్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 299వ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. దీంతో రాకేశ్‌కు గ్రామస్థులతో పాటు, బంధువులు, మిత్రులు అభినందనలు తెలుపుతున్నారు.
News April 20, 2025
ఆత్మకూరు: ప్రైవేట్ నర్సింగ్ హోమ్ సీజ్

ఆత్మకూరులో కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో గర్భంలోనే చనిపోయిన శిశువు తల, మొండెం వేరుచేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు సర్జరీ చేసే చేసే క్రమంలో అనస్తీషియాను అర్హత లేని వ్యక్తులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా క్లినిక్‌ను సీజ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.