News February 7, 2025

తండెల్ సినిమాలో అవకాశం అందుకున్న కన్నెపల్లి వాసి

image

కన్నెపల్లి మండల కేంద్రం ముత్తపూర్‌కు చెందిన హరీష్ మొదట ఢీ జోడిలో సైడ్ డాన్సర్‌గా రాణించారు. అనంతరం శుక్రవారం విడుదలైన తండేల్ సినిమాలో విలన్‌కు సైడ్ క్యారెక్టర్‌గా హరీష్ నటించారు. డైరెక్టర్‌గా చెందు మండేటి, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి సినిమాలో నటించారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన హరీష్ చిన్న పాత్రలో కనిపించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరకు సినిమాలో కనిపించారు. 

Similar News

News April 17, 2026

అనకాపల్లి జిల్లా పంచాయతీ ఓటర్లు ఎందరంటే..!

image

అనకాపల్లి జిల్లా పంచాయతీ ఓటర్లు మొత్తం 12,35,083 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పురుషులు 6,02,281, మహిళలు 6,32,785, ఇతరులు 17 మంది ఉన్నారు. మాడుగులలో అత్యధికంగా 10,069 మంది, వీజేపురంలో తక్కువగా 671 మంది ఓటర్లున్నారు. బుచ్చయ్యపేటలో 52,238 మంది ఓటర్లు నమోదయ్యారు. జాబితాలను ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవాలని అధికారులు సూచించారు.

News April 17, 2026

గుంటూరు జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

image

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం 7,34,672 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 3,54,330 మంది ఉండగా, మహిళలు 3,80,306 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 36 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News April 17, 2026

కర్నూలు: ఘోర ప్రమాదలో 9కి చేరిన మృతుల సంఖ్య

image

మంత్రాలయం(M) చిలకలడోణ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. కర్ణాటక నుంచి మంత్రాలయానికి సరకు రవాణా వాహనంలో 22 మంది భక్తులు వెళ్తుండగా సిమెంట్ లారీని ఢీకొట్టి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. 12 మంది తీవ్రంగా గాయాపడ్డారు. వారిలో తేజశ్విని(15) కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది.