News April 22, 2025
తండ్రీకూతురి ప్రాణం తీసిన లారీ

ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మృతులు ముత్తుకూరు చెందిన వడ్డే ఈరన్న, శ్రావణిగా గుర్తించారు. బాలిక చిప్పగిరి KGBV పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో కుమార్తెను తండ్రి బైక్‌పై ఇంటికి తీసుకెళ్తుండగా లారీ ఢీకొని దుర్మరణం చెందారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News April 23, 2025
10th Results: 25వ స్థానంలో కర్నూలు జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 31,185 మంది పరీక్ష రాయగా 20,584 మంది పాసయ్యారు. 16,326 మంది బాలురులో 9,854 మంది, 14,859 మంది బాలికలు పరీక్ష రాయగా 10,730 మంది పాసయ్యారు. 66.01 పాస్ పర్సంటైజ్‌తో కర్నూలు జిల్లా 25వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
News April 23, 2025
నేడే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.