News February 5, 2025
తంబళ్లపల్లి: వింత వ్యాధితో నాటు కోళ్లు మృతి

తంబళ్లపల్లి మండలం కోటకొండ గ్రామం మద్దిరాల పల్లిలో నిన్నటి నుంచి 500 నాటు కోళ్లు మృతి చెందాయని గ్రామస్థులు చెబుతున్నారు. అంతుచిక్కని వింత వ్యాధితో వ్యాక్సిన్ వేసిన కోళ్లు కూడా చనిపోయాయని తెలిపారు. కేజీ రూ.450 పలుకుతున్న నాటు కోళ్లు మృతి చెందడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు వాటి యజమానులు వాపోతున్నారు.
Similar News
News February 9, 2026
కృష్ణా: ‘వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి’

జిల్లాలో వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ ప్రత్యేకంగా ముద్రించిన గోడ పత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News February 9, 2026
MTM: బాల్య వివాహా ముక్తి రధాన్ని ప్రారంభించిన కలెక్టర్

జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ICDS ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన బాల్య వివాహా ముక్తి రధాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ICDS PD రాణి, DCPO కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
News February 9, 2026
మంచిర్యాల: ఈ నెల 20లోగా పత్తి విక్రయించాలి

జిల్లాలోని రైతులు ఈ నెల 20వ తేదీలోగా తమ వద్ద ఉన్న పత్తిని విక్రయించాలని జిల్లా మార్కెటింగ్ అధికారి ఎండి షాహాబుద్దీన్ తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేస్తామన్నారు. రైతులు సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలలో పత్తి విక్రయించాలని సూచించారు.


