News October 18, 2024
తంబళ్లపల్లె విద్యార్థిని తేజశ్వినికి సీఎం ప్రశంసలు

CA ఫలితాలల్లో ఆలిండియా 14వ ర్యాంకు, CMA పరీక్షల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన తంబళ్లపల్లె విద్యార్థిని తేజశ్వినిని CM చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు ఆమె తన నాన్నతోపాటూ CMను అమరావతిలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయి ర్యాంకులతో ఏపీ పేరు ప్రతిష్ఠలను నిలపడం గర్వంగా ఉందని సీఎం అన్నారు.
Similar News
News December 3, 2025
4న చిత్తూరు జిల్లాకు పవన్ రాక..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 4న చిత్తూరులో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. చిత్తూరు డీడీవో కార్యాలయాన్ని ఆయన నేరుగా ప్రారంభిస్తారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను ఓపెన్ చేస్తారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
News December 2, 2025
చిత్తూరు: 70 బస్సులకు నోటీసులు

కాలేజీ, స్కూల్ బస్సుల యాజమాన్యాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చిత్తూరు DTC నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వారం రోజులుగా జిల్లాలో తనిఖీలు చేశామన్నారు. జిల్లాలో సుమారు 900 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయన్నారు. ఇటీవల 200పైగా బస్సులను తనిఖీ చేశామని.. నిబంధనలు పాటించని 70 బస్సులకు నోటీసులు అందించామని వెల్లడించారు.
News December 2, 2025
ఐరాల: మహిళపై చిరుత పులి పిల్లల దాడి

ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో మహిళపై చిరుత పులి పిల్లలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు మేరకు.. ఓ మహిళ ఆదివారం సాయంత్రం తన ఆవులను మేతకు తీసుకెళ్లింది. చిరుత పులి పిల్లలు ఆమెపై దాడి చేశాయి. గోళ్లతో గాయం చేశాయి. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నెలలోనే 5ప్రదేశాల్లో చిరుత పులి దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు.


