News October 18, 2024

తంబళ్లపల్లె విద్యార్థిని తేజశ్వినికి సీఎం ప్రశంసలు

image

CA ఫలితాలల్లో ఆలిండియా 14వ ర్యాంకు, CMA పరీక్షల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన తంబళ్లపల్లె విద్యార్థిని తేజశ్వినిని CM చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు ఆమె తన నాన్నతోపాటూ CMను అమరావతిలోని సచివాలయంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయి ర్యాంకులతో ఏపీ పేరు ప్రతిష్ఠలను నిలపడం గర్వంగా ఉందని సీఎం అన్నారు.

Similar News

News November 4, 2024

రెండు రోజుల్లో 1,72,565 మందికి శ్రీవారి దర్శనం

image

శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు వారాంతాల్లో టీటీడీ పెద్ద పీఠ వేస్తోంది. శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించింది. శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది.

News November 4, 2024

రేపు చిత్తూరులో జాబ్ మేళా 

image

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 18-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన యువతి యువకులు అర్హులన్నారు. 

News November 3, 2024

తిరుమలలో భారీ రద్దీ.. భక్తుల అవస్థలు

image

తిరుమల శ్రీవారి దర్శనానికి నేడు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతోపాటు దీపావళి సెలవులు ముగియడంతో పెద్ద ఎత్తున కొండ మీదకి తరలి వెళ్లారు. దీంతో ప్రధాన కంపార్ట్‌మెంట్లన్నీ నిండి భారీగా క్యూ లైన్ ఏర్పడింది. సుమారు ఆరు గంటల నుంచి ఆహారంతోపాటు నీటి సదుపాయం కూడా లేదని పలువురు చిన్న పిల్లల తల్లులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ సిబ్బంది స్పందించాలని వారు కోరారు.