News March 7, 2025
తక్కువ ధరలకే ఔషధ విక్రయాలు: ఎంపీ

జన ఔషధి కేంద్రలంలో తక్కువ ధరలకే నాణ్యమైన ఔషధాలు లభిస్తాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. పోస్టాఫీసు ఎదురుగా ఉన్న జన ఔషధి కేంద్రంలో జన ఔషధి దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బయట మెడికల్ షాపుల్లో బ్రాండెడ్ ఔషధ ధరలు ఆకాశాన్ని అంటున్నాయని.. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ధరలకే జన ఔషధి కేంద్రల ద్వారా విక్రయిస్తున్నాయన్నారు. ఈ ఔషధాలన్నీ బ్రాండెడ్ ఔషధాల మాదిరిగానే పనిచేస్తాయన్నారు.
Similar News
News December 21, 2025
VZM: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల లక్ష్మివరప్రసాద్‌ని నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. కిమిడి నాగార్జున జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండంగా.. ప్రసాదుల లక్ష్మివరప్రసాద్ యాదవ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.
News December 21, 2025
విజయనగరంలో పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

విజయనగరం పట్టణంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు 1,172 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు ఉన్న సుమారు 2 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
News December 21, 2025
VZM: జిల్లా వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం

జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం మొత్తం 1,171 పోలియో కేంద్రాలు, 20 ట్రాన్సిట్ టీమ్‌లు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 22, 23, 24వ తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.


