News January 27, 2025

తగరపువలస ఘటనలో మరో చిన్నారి మృతి

image

తగరపువలసలోని ఆదర్శనగర్‌లో పురుగుమందు తాగిన ఘటనలో <<15257483>>విషాదం <<>>చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఇషిత(5) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల భార్యాభర్తల గొడవతో మనస్తాపం చెందిన వివాహిత మాధవి(25) ఇద్దరి కుమార్తెలతో పాటు పురుగు మందు తాగిన విషయం తెలిసిందే. దీంతో మాధవితో పాటు చిన్న కుమార్తె శనివారం మృతి చెందింది. మృతిరాలి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగా పనిచేస్తున్నాడు.

Similar News

News October 26, 2025

విశాఖ: నడిసంద్రంలో బిక్కుబిక్కుంటూ

image

విశాఖలోని జాలరిపేటకు చెందిన ఎల్లాజీ శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం 8 బోట్ల సహాయంతో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. వేట సమయంలో తిరగబడిపోయిన తెప్పపై 40 గంటల పాటు నిలబడి ప్రాణాలు కాపాడుకున్నాడు. బిక్కుబిక్కుమంటూ ఉన్న ఎల్లాజీని కాకినాడ జిల్లా కంతంపేట మత్స్యకారులు గమనించి కాపాడారు. స్థానిక జేడి ఆఫీసుకి సమాచారం అందజేయండంతో విశాఖ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 26, 2025

మంత్రి సత్యకుమార్ విశాఖ పర్యటన రద్దు

image

ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ విశాఖ పర్యటన రద్దయింది. ఆదివారం రాత్రి విశాఖ చేరుకుని మూడు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారని మొదట ప్రకటన జారీ చేశారు. అయితే మొంథా తుపాన్ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.

News October 26, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండండి: జీవీఎంసీ కమిషనర్

image

తుఫాను కారణంగా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. సహాయక చర్యల కోసం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ (0891-2507225), టోల్ ఫ్రీ నంబర్ (1800-425-0009) ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు, కొండవాలు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, తప్పుడు సమాచారం నమ్మవద్దని సూచించారు.