News August 18, 2024
తగిన మూల్యం చెల్లించక తప్పదు: మాజీ మంత్రి దేవినేని
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఫైళ్ల దహనం ఘటనల వెనుక వైసీపీ కుట్ర ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. చేసిన పాపాల సాక్ష్యాలను మాయం చేసేందుకు ఈ విధంగా దస్త్రాలకు నిప్పు పెడుతున్నారని ఉమ ఆరోపించారు. ఫైళ్ల దహనంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తుందని, సాక్ష్యాలు బూడిద చేసి తప్పించుకోవాలనుకునే వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఉమ Xలో పోస్ట్ చేశారు.
Similar News
News September 20, 2024
విజయవాడ: బెయిల్ కోసం కాంతిరాణా టాటా పిటిషన్
సస్పెన్షన్‌లో ఉన్న IPS అధికారి కాంతిరాణా టాటా ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారణ జరపనున్నట్లు సమాచారం. కాగా కాదంబరి జెత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం కాంతి రాణా టాటాను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
News September 20, 2024
ఈ నెల 30న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు
కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున ఆ మార్గం గుండా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు విజయవాడ-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లను(నం.12718 &12717) ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
News September 20, 2024
కృష్ణా: ANU డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y23 బ్యాచ్) రెగ్యులర్ పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.