News February 11, 2025
తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, కళ్యాణకట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.18,59,854 ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News October 27, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 27, 2025
జిల్లా పోలీస్ కార్యాలయానికి రావొద్దు: VZM SP

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టమ్’ (PGRS) రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదివారం ప్రకటించారు. “మొంథా” తుఫాను ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా మారుతున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదుదారులు ఎవ్వరూ రావద్దని, తుఫాను సమయంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలన్నారు.
News October 27, 2025
శుభ సమయం (27-10-2025) సోమవారం

✒ తిథి: శుక్ల షష్ఠి తె.3.07 వరకు
✒ నక్షత్రం: మూల ఉ.10.27
✒ శుభ సమయాలు: సామాన్యము
✒ రాహుకాలం: ఉ.7.30-9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, వర్జ్యం: ఉ.8.43-10.28, రా.8.46-10.30, ✒ అమృత ఘడియలు: లేవు
✍️ రోజువారీ పంచాంగం, రాశి ఫలాలు కోసం <<-se_10009>>క్లిక్<<>> చేయండి.


