News March 4, 2025
తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాలు ద్వారా రూ.8,17,320, VIP దర్శనాలు రూ.1,80,000, కార్ పార్కింగ్ రూ.1,62,000, వ్రతాలు రూ.1,13,600, కళ్యాణ కట్ట రూ.90,000, సువర్ణ పుష్పార్చన రూ.75,200, యాదరుషి నిలయం రూ.44,860, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,77,910 ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News March 4, 2025
NLG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ‘సారీ’!

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. అంతేకాదు గత నాలుగు పర్యాయాలుగా ఒకసారి గెలిచిన అభ్యర్థిని / సంఘాన్ని వరుసగా రెండోసారి ఉపాధ్యాయులు గెలిపించడం లేదు. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ 2007లో శాసనమండలిని పునరుద్ధరించారు. అప్పుడు మొదటిసారి నిర్వహించిన WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య యూటీఎఫ్ తరఫున విజయం సాధించారు.
News March 4, 2025
BREAKING: ఎమ్మెల్సీ ఎన్నికలు.. మరో టీడీపీ అభ్యర్థి విజయం

AP: ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై గెలిచారు. ఏడో రౌండ్ ముగిసేసరికి 70వేల ఓట్ల వ్యత్యాసం ఉంది. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇది పూర్తయితే మెజార్టీలో స్వల్ప మార్పులుండొచ్చు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఎన్నికైన విషయం తెలిసిందే.
News March 4, 2025
మేలో ‘ఎల్లమ్మ’ షూటింగ్!

‘బలగం’తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు తెరకెక్కించే కొత్త సినిమా ‘ఎల్లమ్మ’ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన వేణు.. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ముంబైకి వెళ్లారు. మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.