News March 20, 2025

తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

image

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్ రూ.1,08,700, VIP దర్శనాలు రూ.60,000, బ్రేక్ దర్శనాలు రూ.83,700 ప్రసాద విక్రయాలు రూ.6,23,920, కళ్యాణకట్ట రూ.40,000, అన్నదాన విరాళాలు రూ.25,879, సువర్ణ పుష్పార్చన రూ.32,549, కార్ పార్కింగ్ రూ.2,10,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.14,05,339 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

Similar News

News December 23, 2025

మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి

image

10 రోజులుగా మేడిపల్లి ఓసీపీతోపాటు గోలివాడ, మల్యాలపల్లి, మల్కాపూర్‌ శివారుల్లో పెద్ద పులి సంచరించిన విషయం విధితమే. ఈ రోజు మల్కాపూర్‌ గ్రామ శివారు గోదావరి నది మీదుగా మంచిర్యాల జిల్లా ఇందారం ఏరియాలోకి పెద్ద పులి వెళ్లింది. స్థానిక గోదావరిలో పెద్ద పులి పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్‌ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పెద్ద పులి సంచారంతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు దీంతో ఊపిరి పీల్చుకున్నారు.

News December 23, 2025

ఈ నెలాఖరు నుంచి ఫ్యామిలీ సర్వే

image

AP: ఈ నెలాఖరు నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(UFS) నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపింది. ‘అర్హులకు సంక్షేమ పథకాలు, సేవలు అందించడం, కుటుంబాల సమాచారాన్ని అప్డేట్ చేయడం ఈ సర్వే ఉద్దేశం. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సర్టిఫికెట్ల జారీ సులభతరమవుతుంది. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు భంగం వాటిల్లదు’ అని పేర్కొంది.

News December 23, 2025

కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర తేదీలు ఇవే

image

భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామి ఆలయంలో 2026 సం.నికి సంబంధించిన బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 9 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. జనవరి 10న వీరభద్ర స్వామి కళ్యాణం, 14న భోగి పండుగ, 15న బండ్ల తిరుగుట(సంక్రాంతి) కార్యక్రమాలు జరుగనున్నాయి. జనవరి 18న అగ్నిగుండాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.