News March 25, 2025
తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు భక్తుల రద్దు తో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్ రూ.1,19,150, కళ్యాణకట్ట రూ.70,000, వ్రతాలు రూ.1,28,800, విఐపి దర్శనాలు రూ.1,35,000, కార్ పార్కింగ్ రూ.2,34,500, ప్రసాద విక్రయాలు రూ.8,60,160, తదితర విభాగాలు మొత్తం కలిపి ఆదాయం రూ.18,61,839 వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.
Similar News
News November 16, 2025
కంచరపాలెంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

కంచరపాలెంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కంచరపాలెం సీఐ రవికుమార్ సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. పదిరోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉండవచ్చని, మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్లు ఉంటుందని సీఐ తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని, దీనిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చెప్పారు
News November 16, 2025
జగిత్యాల: 4 జంటలను కలిపిన లోక్ అదాలత్

జగిత్యాల జిల్లా కోర్టులో NOV 15 నుంచి జరుగుతున్న ప్రత్యేక లోక్ అదాలత్ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సూచించారు. సంవత్సరాల తరబడి లాగకుండా, రాజీతో వేగంగా కేసులను పరిష్కరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటివరకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసుల చొరవతో విడాకుల అంచున ఉన్న నలుగురు దంపతులను ఈ లోక్ అదాలత్ మళ్లీ కలిపింది.
News November 16, 2025
సిరిసిల్ల: పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న జనం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. ఒక్కసారిగా పెరిగిన చలితో జనం వణుకుతున్నారు. చలి నుంచి రక్షణకు అవసరమైన చర్యలపై ప్రజలు దృష్టి సారించారు. వృద్ధులు, చిన్నపిల్లలు చలి మంటలు వేసుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్వెటర్లు, మఫ్లర్ ధరించడం ద్వారా కొంత ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో రాత్రివేళ రుద్రంగిలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, ఇల్లంతకుంటలో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


