News April 9, 2025
తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విగ్రహాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, యాదరుషి నిలియం, కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.13,17,083 ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News December 2, 2025
చిత్తూరు: 70 బస్సులకు నోటీసులు

కాలేజీ, స్కూల్ బస్సుల యాజమాన్యాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చిత్తూరు DTC నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వారం రోజులుగా జిల్లాలో తనిఖీలు చేశామన్నారు. జిల్లాలో సుమారు 900 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయన్నారు. ఇటీవల 200పైగా బస్సులను తనిఖీ చేశామని.. నిబంధనలు పాటించని 70 బస్సులకు నోటీసులు అందించామని వెల్లడించారు.
News December 2, 2025
తల్లీకూతుళ్ల బంధం ప్రత్యేకం

తల్లీకొడుకూ, తండ్రీకూతుళ్ల బంధాల గురించే అందరూ ప్రస్తావిస్తారు. కానీ తల్లీకూతుళ్ల బంధం ప్రత్యేకమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, అవగాహన, కూతురు పెరిగే క్రమంలో స్వేచ్ఛగా పంచుకున్న ఆలోచనలు, భావాలు, అనుభవాలతోపాటు హార్మోన్లు దీనికి కారణమని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. భావోద్వేగాల్ని నియంత్రించే మెదడు నిర్మాణం ఇద్దరిలో ఒకేలా ఉండటమూ ఈ బలమైన బంధానికి ఓ కారణమట.
News December 2, 2025
వరంగల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో 124 కేసులు నమోదు

మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 124 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలో 94, వెస్ట్ జోన్లో 6, ఈస్ట్ జోన్లో 2, సెంట్రల్ జోన్లో 22 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.


