News February 11, 2025

తగ్గుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. సోమవారం సాయంత్రానికి స్పిల్ వే(546 అడుగులు) దిగువకు 543.80 అడుగులకు పడిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 593 అడుగులు కాగా.. ప్రస్తుత 543 అడుగులకు చేరింది. మరోవైపు ఎడమ కాలువకు ఆన్ ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ రైతుల డిమాండ్ మేరకు కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు.

Similar News

News March 27, 2025

డ్రగ్స్ కేసుల్లో No.1గా మారిన ‘అక్షరాస్యుల కేరళ’

image

అత్యధిక అక్షరాస్యులున్న కేరళను డ్రగ్స్ భూతం వేధిస్తోంది. దాన్ని అంతం చేయడంలో GOVT విఫలమవుతోంది. తాజాగా పంజాబ్‌ను దాటేసి దేశంలోనే No.1 డ్రగ్స్ ప్రభావిత రాష్ట్రంగా మారింది. 2021లో 5,696గా ఉన్న NDPS కేసులు 2024లో 27,701కి చేరుకున్నాయి. పంజాబ్‌ (9,025)తో పోలిస్తే ఇవి 3 రెట్లు ఎక్కువ. 2021కి ముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవ్వగా ఆ తర్వాతి నాలుగేళ్లలో ఇవి 87,101కు చేరాయి. ఏకంగా 130% పెరిగాయి.

News March 27, 2025

మోహన్ లాల్ ‘L2:ఎంపురాన్’ మూవీ రివ్యూ

image

లూసిఫర్ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన ‘L2:ఎంపురాన్’ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో PKR వారసుడిగా సీఎం పదవి చేపట్టిన జితిన్‌ చేసే అవినీతిని హీరో ఎలా అడ్డుకున్నాడనేది స్టోరీ. మోహన్ లాల్, టొవినో థామస్, పృథ్వీరాజ్ మెప్పించారు. సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ బాగున్నాయి. బలహీనమైన స్టోరీ, ఎమోషన్ సీన్లు లేకపోవడం, నిడివి, స్లోగా ఉండటం మైనస్.
WAY2NEWS RATING: 2.5/5.

News March 27, 2025

పోక్సో కేసు నిందితులపై రౌడీ షీట్: హోంమంత్రి అనిత

image

AP: రాష్ట్రంలో పోక్సో కేసు నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శక్తి యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన 509 CC కెమెరాలను ప్రారంభించిన అనంతరం హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

error: Content is protected !!