News October 26, 2024

తడలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

తడ రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు మాంబట్టు సెజ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న వరదయ్యపాలెం గ్రామానికి చెందిన ప్రభాకర్‌గా పోలీసులు గుర్తించారు. ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 1, 2025

నెల్లూరు: మెడికల్ కాలేజీలో ఏం జరుగుతోంది..?

image

నెల్లూరు AC సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో వరుస సూసైడ్ కేసులు కలవరపెడుతున్నాయి. సరిగ్గా 2 నెలలకింద మెడికో విద్యార్థిని మృతి చెందగా.. తాజాగా మరో మెడికో మృతి చెందింది. అయితే హాస్టల్స్‌ విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడిందా?. విద్యార్థులు హాస్టల్స్‌లో ఉన్నప్పుడే సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి?. వీటన్నింటిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, భద్రతా ప్రమాణాలు పాటించాలని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు.

News December 1, 2025

నెల్లూరు: అసంతృప్తిలో కూటమి నాయకులు..!

image

నెల్లూరు జిల్లాలోని కూటమి నాయకుల్లో అసంతృప్తి చెలరేగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన తమను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి మంత్రులు, MLAలే కాంట్రాక్టర్లుగా మారుతున్నారని వాపోయారు. తమకంటూ ఏ పనులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాగే ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

News December 1, 2025

గూడూరులో దారుణం

image

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్‌లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్‌కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.