News March 4, 2025
తడి,పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

తడి,పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ బాలాజీ అన్నారు. సోమవారం మచిలీపట్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన అన్ని మున్సిపల్ కమిషనర్లు, ఎండీవోలు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొంతమంది తడి,పొడి చెత్తను కలిపి ఇస్తున్నారని, దీనిపై పారిశుద్ధ్య సిబ్బందికి అవగాహన లేనట్లనిపిస్తుందని, ప్రజలకు సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News March 4, 2025
కృష్ణా: వాలంటీర్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఇదే..!

గుంటూరు- కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడకు చెందిన వాలంటీర్ గంటా మమత ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపులో ఆమెకు మొత్తంగా 718 ఓట్లు వచ్చాయి. చట్ట సభల్లో ప్రజలు, వాలంటీర్ల సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇకపైనా వాలంటీర్ల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
News March 3, 2025
పెనమలూరు: సీఎం పర్యటన భద్రతపై సమీక్షించిన ఎస్పీ

పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో, భద్రత ఏర్పాట్లను సోమవారం ఎస్పీ ఆర్ గంగాధర్ రావు పరిశీలించారు. 5వ తేదీ సాయంత్రం సిద్ధార్థ కాలేజ్ ఆవరణలో రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. రిసెప్షన్ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
News March 3, 2025
బాపులపాడు: రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

బాపులపాడు మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా గుండుగొలనుకి చెందిన నాగరాజు కుటుంబం బైక్‌పై గుడివాడ వెళ్తుండగా ఆరుగొలను వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.