News April 8, 2025
తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: సీతక్క

ములుగు జిల్లాలో కురిసిన వర్షానికి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ను మంత్రి సీతక్క ఆదేశించారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. మండలాల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధికారులతో పర్యటించి రైతులకు అండగా ఉండాలన్నారు.
Similar News
News November 23, 2025
తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ వంటల వారసత్వ వాక్

ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ టూరిజం ‘తెలంగాణ వంటల వారసత్వ వాక్’ను చార్మినార్లో ప్రారంభించింది. వంటకాల రుచి, తయారీ పద్ధతులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, ఫుడ్ స్టార్టప్లకు ప్రోత్సాహం అందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, వాటి వెనుక ఉన్న కథలను, చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
News November 23, 2025
తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు.. కానీ!

ఈ ప్రపంచంలో తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటిలోనూ రసాయనాలు చేరుతున్నాయి. తాజాగా బిహార్ తల్లుల పాలల్లో యురేనియం(5ppb-పార్ట్స్ పర్ బిలియన్) ఆనవాళ్లు గుర్తించినట్లు NDMA సైంటిస్ట్ దినేశ్ వెల్లడించారు. అయితే WHO అనుమతించిన స్థాయికంటే తక్కువగానే ఉన్నాయని, దీనివల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్పారు. నీటిలో మాత్రం 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయన్నారు.
News November 23, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా నియమించబడ్డారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న హర్ష వర్ధన్ రాజు డిసెంబర్ 2 వరకు సెలవుల్లో ఉన్నారు. ఆ సమయంలో బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రకాశం జిల్లాకు ఇన్ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల ఎస్పీ కార్యాలయ ప్రతినిధులు ఆదివారం ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.


