News May 12, 2024

తడ: ప్రత్యేక పడవలపై బయలుదేరిన పోలింగ్ సిబ్బంది

image

తడ మండలం ఇరకం దీవిలో నివసిస్తున్న ఓటర్ల కోసం ఆదివారం రెండు ప్రత్యేక పడవల్లో పోలింగ్ సిబ్బంది, అధికారులు ఈవీఎం పరికరాలతో బయలుదేరి వెళ్లారు. ఇరకం దీవిలోని రెండు పోలింగ్ కేంద్రాలలో 1148 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రెండు పోలింగ్ కేంద్రాలకుగాను 30 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది బయల్దేరి వెళ్లారు.

Similar News

News November 23, 2025

నిరుద్యోగ యువతకు ఈ సంస్థ గురించి తెలుసా.?

image

గ్రామీణ నిరుద్యోగ యువతకు వెంకటాచలంలో ఉన్న స్వర్ణభారత్–సోమా సాంకేతిక శిక్షణా సంస్థ ఓ ఆశాదీపంగా నిలిచింది. డిమాండ్ ఉన్న రంగాలలో సాంకేతిక నిపుణులతో ఉచిత శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. గడచిన 14 ఏళ్లలో 5,420 మంది ఇక్కడ శిక్షణ పొందగా 80% మందికి పైగా యువకులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. శిక్షణ పొందే వారికి ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తున్నారు.

News November 23, 2025

కోటంరెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ భేటీ

image

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. మాగుంట లేఔట్‌లోని కోటంరెడ్డి కార్యాలయానికి నారాయణ వచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

News November 23, 2025

నెల్లూరు: దీపావళి స్కీం పేరుతో రూ.73 లక్షలు టోకరా..?

image

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.