News March 15, 2025

తడ: లారీ ఢీకొని వ్యక్తి‌ స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన తడ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కొండప్ప నాయుడు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి చెన్నై వైపు రోడ్డు మార్షన్‌లో నిలబడిన రవి అనే వ్యక్తిని లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో వ్యక్తి తలకు తీవ్రగాయాలు కాగా, అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని కుమారుడు అజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Similar News

News March 8, 2026

భాకరాపేట ఘాట్లో రోడ్డు ప్రమాదం.. క్లీనర్ స్పాట్ డెడ్

image

చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందారు. తిరుపతి నుంచి పీలేరు వైపు వెళ్తున్న లారీ వెనుక భాగంలో టైరు కింద రాయి పెడుతున్న సమయంలో వెనుక నుంచి బొలెరో వాహనం ఢీకొనడంతో క్లీనర్ అక్కడకక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

News March 8, 2026

KMR: ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యం

image

కామారెడ్డిలో మిస్సింగ్ అయిన ఐదుగురు చిన్నారుల ఘటనలో విషాదం చోటుచేసుకుంది. ఆర్బీనగర్ కాలనీకి చెందిన అయత్(7), సీపత్(5), మరియం(5)<<19324752>> మృతదేహాలు<<>> పట్టణ సమీపంలోని చెరువులో లభ్యమయ్యాయి. ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నారుల తండ్రే ముగ్గురు పిల్లలను ఒక ఆటోలో తీసుకువెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వారిని పోషించలేక తండ్రే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

News March 8, 2026

ఖమ్మం: భారీగా యూరియా రాక

image

చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు శనివారం 2,670.84 మెట్రిక్ టన్నుల ఇఫ్కో యూరియా చేరుకుంది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,070.84 టన్నులు, భద్రాద్రికి 500, మహబూబాబాద్‌కు 900, ఖమ్మం సీఆర్పీకి 200 టన్నుల యూరియా కేటాయించినట్లు టెక్నికల్ ఏవో పవన్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.